: అమరావతిలో కేసీఆర్ చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనే లేదు: టీజీ వెంకటేష్


ఏపీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్తుల విలువలో 60 శాతం ఏపీకి ఇచ్చి తీరాలని, అందుకోసం పోరాటం చేస్తామని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేదని అన్నారు. నవాబుల ఆస్తులు తమకే చెందుతాయని కేసీఆర్ అంటున్నప్పుడు, సమైక్యాంధ్రప్రదేశ్ లోని ఆస్తుల్లో ఏపీకి ఎందుకు వాటా రాదు? అని ప్రశ్నించారు. జలవివాదాలపై కేసీఆర్, హరీష్ రావుల తీరు వివాదాస్పదంగా ఉందని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే తాము కూడా సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడతామని టీజీ వెంకటేష్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News