: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్లు లోపు ఒక రూపాయి, అలాగే 30 కిలోమీటర్లు పైన రూ.2 పెంచారు. దీంతో పల్లె వెలుగు బస్సుల్లో 5 కిలోమీటర్ల వరకు రూ.5 ఉన్న ఛార్జీ రూ.6కు పెరిగింది. సిటీ బస్సులు, డీలక్స్, ఏసీ బస్సుల్లో ఛార్జీలు 10 శాతం పెరిగాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో కిలోమీటరుకు వరుసగా 87 పైసలు, 98 పైసలు, రూ.1.16, రూ.1.46, రూ.1.71, రూ.1.82 పైసలు చొప్పున పెరిగింది. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సంబంధించిన అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచుతున్నామన్నారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో ప్రజలపై రూ.287 కోట్ల భారం పడనుందన్నారు. బస్సు పాసుల ఛార్జీలపై కూడా పెంపు ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News