: మెదక్ జిల్లాలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని ప్రశ్నించిన వీఆర్వోపై దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. కౌడిపల్లి మండలం బండపోతుగల్ సమీపంలో మంజీర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న వీఆర్వో ఎల్లయ్య అక్కడికి వెళ్లారు. ఈ విషయమై ఇసుక మాఫియాను ప్రశ్నించిన ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులకు వీఆర్వో ఫిర్యాదు చేశారు.