: ఏపీ భవన్ ను ఇచ్చేయండి... తెలంగాణ భవన్ కట్టుకుంటాం: కేసీఆర్ డిమాండ్
తొలుత హైదరాబాద్ నిజాం నవాబు ఆస్తిగా ఉండి, ఆపై ఏపీ భవన్ గా మారిన ఢిల్లీలోని ప్రాంతాన్ని తమకు తిరిగి ఇచ్చి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తూ, ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే, తాము తెలంగాణ భవన్ ను నిర్మించుకుంటామని స్పష్టం చేశారు. స్థలం మొత్తాన్నీ తమకు బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలమని ఈ లేఖలో గుర్తు చేసిన ఆయన, దీనిలో ఏపీకి వాటా ఇవ్వరాదని కోరారు. తాము అద్భుత రీతిలో తెలంగాణ భవన్ ను నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు.