: శరీరానికి నిప్పంటించుకుని వీధుల్లోకి పరుగులు పెట్టిన మహిళ!


ఇంట్లో నిత్యమూ గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన మహిళ ఒంటికి నిప్పంటించుకుని వీధుల్లో పరుగులు పెట్టిన ఘటన హైదరాబాదు శివారు శంషాబాద్ సమీపంలో కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం కాపుగడ్డ బస్తీకి చెందిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆపై బాధకు తాళలేక కాపాడాలని అరుస్తూ బయటకు వచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పి వేశారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News