: బీజేపీ.. నమ్మిన ప్రజలను నట్టేట ముంచింది: సోనియా
నమ్మినవారిని బీజేపీ నట్టేట ముంచిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సోనియా నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. చివరికి శాంతి భద్రతలనూ గాలికొదిలేశారని అన్నారు. బీజేపీ చీకటి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఆ మార్పు ఇప్పుడే ప్రారంభం అవ్వాలని సోనియా పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే కర్ణాటకను దేశంలోనే ఉజ్వలమైన రాష్ట్రంగా నిలుపుతామని ఆమె హామీ ఇచ్చారు.