: తెలంగాణ సర్కార్ పై మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన కోదండరామ్
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తనకు చాలా బాధ కలిగించిందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ తప్పును మళ్లీ చేయకుండా చూసుకోవాలని, వచ్చే ఏడాదైనా జయశంకర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని, బాధితులకు మద్దతుగా తాము నిలుస్తామని కోదండరామ్ పేర్కొన్నారు.