: నా డిమాండ్ ను వెనక్కు తీసుకుంటున్నా!: సుబ్రహ్మణ్య స్వామి
చేసిన ఆరోపణలనే పదే పదే చేస్తుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ దఫా వెనక్కు తగ్గారు. ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను తక్షణం తొలగించాలని తాను చేసిన డిమాండ్ ను వెనక్కు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆయన కాంగ్రెస్ కు సహకరిస్తున్నారని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి, ఆపై సొంత పార్టీ నేతలే ఎదురుదాడికి దిగడంతో మాట మార్చారు. "అరవింద్ సుబ్రమణియన్ గురించి తమకన్నీ తెలుసునని, ఆయన దేశానికి విలువైన వాడని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్న పక్షంలో, ఆయన్ను తొలగించాలని నేను చేసిన డిమాండును వెనక్కు తీసుకుంటున్నా. నిజం నిగ్గు తేలే వరకూ వేచి చూస్తాను" అని స్వామి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.