: హీరోనా? డైరెక్టరా?... బహుబలి సెట్లో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారిన నాని


అంత సులువుగా ఎవరికీ ప్రవేశం లభించని బాహుబలి సెట్లోకి 'జెంటిల్ మన్' నాని వెళ్లి కాసేపు దర్శకత్వం చేశాడన్న వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కెమెరా వెనుక నిలబడి, మెగాఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా, యాక్షన్ అంటున్న నాని దృశ్యాలను చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. "మా జంటిల్ మన్ నాని, సెట్స్ ను సర్ ప్రైజ్ విజిట్ చేశారు. హీరోనా? డైరెక్టరా? చివరికి జంటిల్ మన్" అని ట్యాగ్ లైన్లు పెట్టిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు. అన్నట్టు... ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకోగా, నిన్నటికి చిత్రం షూటింగ్ ను ముగిస్తున్నట్టు ప్రకటిస్తూ నాని 'ప్యాకప్' కూడా చెప్పాడట.

  • Loading...

More Telugu News