: భేటీ ముగిసింది... ఫలితం రాలేదు: ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసిన దేవినేని, హరీశ్ భేటీ
రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావుల భేటీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ముగిసింది. కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీ వెళ్లిన దేనినేని, హరీశ్ రావు లు... కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సలహాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఆ భేటీ ఎలాంటి ఫలితాన్నివ్వని నేపథ్యంలో నేటి ఉదయం మరోమారు భేటీ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారి అమర్ జిత్ సింగ్ సమక్షంలో జరిగిన ఈ భేటీలోనూ ఎలాంటి తుది నిర్ణయం జరగలేదు. గంటకు పైగా భేటీ అయినప్పటికీ ఇద్దరు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.