: రాజ్ నాథ్ కు కేసీఆర్ లేఖ!... పదో షెడ్యూల్ సంస్థల విభజనపై నిర్ణయం మార్చాలని వినతి!
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కొద్దిసేపటి క్రితం ఓ లేఖ రాశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పదో షెడ్యూల్ లోని సంస్థల విభజనపై ఇదివరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఆయన రాజ్ నాథ్ ను కోరారు. ఈ విషయంలో ఇప్పటికే తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పిన కేసీఆర్... సదరు పిటిషన్ కు మద్దతుగా కేంద్రం కూడా మరో పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. గతంలో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన సందర్భంగా పదో షెడ్యూల్ సంస్థల విభజనపై తీసుకున్న నిర్ణయాన్నే తాజాగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.