: 'ఇండిగో' ఎయిర్ లైన్స్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్!
డిమాండ్ తగ్గడంతో మరోసారి బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ దేశీయంగా నాన్ స్టాప్ మార్గాల్లో ప్రారంభ ధర 444 రూపాయలకే ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇండిగో కూడా 789 రూపాయలకే టికెట్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇంఫాల్ - గౌహతి మధ్య ఈ ధరకు అందిస్తోంది. స్కూళ్లకు సెలవుల నేపథ్యంలో సాధారణంగా వేసవి సీజన్ లో విమానయాన సంస్థలకు పూర్తిగా డిమాండ్ ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండే కాలం. దీంతో విమానాల్లో సీట్లను పూర్తిగా నింపుకునేందుకు వీలుగా కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. గత వారం కంటే టికెట్ల ధరలు 30 శాతం వరకు తగ్గాయని, డిమాండ్ తగ్గిన దృష్ట్యా ముందుగానే సీట్లను భర్తీ చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.