: నీ సలహాలు ఇక చాలు... ఆపు: సుబ్రహ్మణ్య స్వామిపై మండిపడ్డ జైట్లీ


ఇటీవలి కాలంలో నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నిలుస్తున్న సుబ్రహ్మణ్య స్వామిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఆర్థిక శాఖ సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను తక్షణం తొలగించాలని ఆయన చేసిన డిమాండ్ ను తోసిపుచ్చారు. మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ గా సుబ్రమణియన్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, నిరాధార ఆరోపణలు చేస్తూ, అడగని సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇకపై ఉచిత సలహాలు ఇవ్వడం ఆపాలని హితవు పలికారు. కాగా, తన వల్లనే రాజన్, ఆర్బీఐ పదవికి దూరమవుతున్నాడని చెప్పుకున్న సుబ్రహ్మణ్య స్వామి, అరవింద్ వాషింగ్టన్ వాసని, కాంగ్రెస్ కు తొత్తని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News