: భక్తులు కరవై వెలవెలబోతున్న తిరుమల


తిరుమల గిరులు కళతప్పి వెలవెలబోతున్నాయి. భక్తుల రద్దీ గణనీయంగా తగ్గడంతో వీధులన్నీ బోసిపోయాయి. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో కేవలం 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచివుండగా, నడకదారి భక్తులకు, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు, గంటలోనే దర్శనం పూర్తవుతోంది. అది కూడా క్యూ లైన్లలో నడిచి వెళ్లడానికి పట్టేంత సమయం కోసమే. ఇక రద్దీ ఎంతమాత్రమూ లేదని తెలుసుకున్న తిరుపతి వాసులు స్వామివారిని చూసుకునేందుకు కొండపైకి క్యూ కడుతున్నారు. వీరితో పాటు కొండపై బాలాజీ నగర్ లో నివాసముండే కుటుంబాలు, దుకాణదారులు దర్శనానికి వెళుతున్నట్టు తెలుస్తోంది. వేసవి సెలవులు మొదలైన తరువాత దేవదేవుని సన్నిధిలో ఇంత తక్కువగా భక్తులు కనిపించడం ఇదే మొదటిసారని అంటున్నారు. స్కూళ్లు ప్రారంభం కావడం, పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం తదితర కారణాలతో భక్తుల రాక మందగించిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News