: బ్రిటిషోళ్లే నా సలహాలు తీసుకున్నారు!... కేసీఆర్ సర్కారుపై జానా విసుర్లు!


తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారుపై టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిన్న విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కారుపై ఆసక్తికర ఆరోపణలు చేశారు. బ్రిటిష్ వాళ్లే తన సలహాలు తీసుకుంటే... ప్రస్తుత కేసీఆర్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా తమ సూచనలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన రాజకీయ అవసరాల కోణంలోనే జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం గనులను దక్కించుకునేందుకు... బయ్యారం, గార్ల ప్రాంతాలను మహబూబాబాద్ లో కలిపేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ హైకమిషనర్ నిన్న హైదరాబాదులో పర్యటించిన నేపథ్యంలోనే జానారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News