: కేటీఆర్, హరీశ్ ల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు


తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల అంశంపై కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుల కోసమే ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ జిల్లా ఉందని, కేటీఆర్ కోసం సిరిసిల్ల, హరీశ్ కోసం సిద్ధిపేటలను ఇప్పుడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరిగితే తాము సంతోషిస్తామని, కుటుంబసభ్యుల కోసం చేస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. కరీంనగర్ లోని గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం సీఎం స్వార్ధ రాజకీయాలకు అద్దం పడుతుందని శ్రీధర్ బాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News