: ఉమాభారతి సూచనతో ఢిల్లీలో భేటీ అయిన హ‌రీశ్‌, దేవినేని


కేంద్రమంత్రి ఉమాభారతి సూచన మేరకు తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదాన్ని పరిష్కరించుకునే అంశంపై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్కడి విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఈ స‌మావేశం కొన‌సాగుతోంది. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ ముఖ్యకార్యదర్శి కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డ్డ కృష్ణా నది నీటి పంపిణీ వివాదంపై నిన్న, ఈరోజు స‌మావేశం నిర్వ‌హించిన కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ.. స‌మ‌స్య‌ను ఇరు రాష్ట్రాలే ప‌రిష్క‌రించుకోవాలని చెప్పిన విష‌యం తెలిసందే. ఇరు రాష్ట్రాల మంత్రులు ఇదే అంశంపై ఢిల్లీ పెద్ద‌ల ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News