: దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు... ముఠా సభ్యుల్లో ఒక న్యాయవాది
దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన 1.4 కిలోల బంగారం, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో 107 కేసులు నమోదయ్యాయని, ముఠా సభ్యుల్లో ఒక న్యాయవాది కూడా ఉన్నారని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.