: మళ్లీ స్కూల్ బాట పట్టిన ‘సైరత్’ హీరోయిన్
మరాఠీ చిత్ర పరిశ్రమలోనే అతి పెద్ద హిట్ రికార్డు నమోదు చేసిన చిత్రం ‘సైరత్’. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన హీరోయిన్ రింకూ రాజ్ గురు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రింకూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఈ చిత్రం షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమం, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపిన రింకూ మళ్లీ స్కూల్ బాట పట్టింది. షోలాపూర్ జిల్లాలోని తన స్వగ్రామం అక్లుజ్ లోని పాఠశాలకు ఈరోజు వెళ్లింది. ఈ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పింది. ఈ నెల 12న స్వగ్రామం చేరుకున్న రింకూకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కాగా, ప్రేమకథతో తెరకెక్కిన ‘సైరత్’ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు. కలెక్షన్ల విషయాని కొస్తే, ఈ చిత్రం వందకోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.