: ఆలయ హుండీ లెక్కింపులో బంగారు ఆభరణాలు మింగేశాడు
కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం హుండీ లెక్కింపులో ఒక కాంట్రాక్టు కార్మికుడు కనకయ్య తన చేతివాటం ప్రదర్శించాడు. హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న సమయంలో బంగారు ఆభరణాలు చెవికమ్మలు, చైన్ మింగేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.