: ‘స్పైస్ జెట్’ మాన్సూన్ బొనాంజా... రూ.444ల ప్రారంభ ధర!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఆఫర్లు ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444గా పేర్కొంది. ‘మాన్సూన్ బొనాంజా సేల్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ల వివరాలు... జమ్ము-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబయి, ముంబయి-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్ సర్ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444గా పేర్కొంది. ఈ నెల 26 వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు జులై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు ప్రయాణించవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. స్పైస్ జెట్. కామ్ తో పాటు ఇతర ట్రావెల్ పోర్టళ్లు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఆఫర్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని తెలిపింది. కాగా, మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని అనుసరించి విమాన ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు.