: 27నుంచి మూడు రోజుల నిర‌స‌న దీక్ష‌కు దిగుతాం: వీహెచ్‌


మల్లన్న సాగర్ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈరోజు మెద‌క్ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన వారికి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంద‌ని తెలిపారు. తమ పార్టీనేత‌లు ఈ అంశంపై ఈనెల 27నుంచి మూడు రోజుల నిర‌స‌న దీక్ష‌కు దిగ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టులు రీ డిజైనింగ్ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌మీష‌న్ల కోస‌మే రీ డిజైనింగ్ చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్‌ పార్టీలో చేరి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని కొందరు నేత‌లు త‌మ పార్టీని వీడుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News