: ఎన్ఎస్జీ కోసం స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని మోదీ... సియోల్ వెళ్లేందుకు నిర్ణయం!
అణు సరఫరాదారుల బృందంలో చేరాలని ఇండియా గట్టిగా భావిస్తుండగా, రోజుకో మాట చెబుతూ అడ్డు పడుతున్న చైనాను నిలువరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలోని సియోల్ లో జరగనున్న ఎస్ఎస్జీ ప్లీనరీ సమావేశాలకు స్వయంగా హాజరయ్యేందుకు ఆయన బయలుదేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. చైనా పదేపదే భారత్ రాకను వ్యతిరేకిస్తూ, సియోల్ లో సైతం అడ్డుకున్న పక్షంలో, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు చైనాకు వ్యతిరేకంగా ఓ రూలింగ్ ను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.