: నా కొడుకును లాఠీలతో కొడుతూ తీసుకెళతారా? అంటూ రాయలేని తిట్లను వాడిన ముద్రగడ


కొద్దిసేపటి క్రితం 13 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించిన ముద్రగడ పద్మనాభం, మీడియాతో మాట్లాడుతూ, రాయలేని తిట్లను వాడటం సంచలనం కలిగించింది. "నా కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళతారా......." అంటూ ఆయన తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తన ఇంట్లో తలుపులు బద్దలు కొట్టారని, దాన్ని తప్పని చెప్పడం లేదని, దీక్ష నాలుగో రోజో, ఐదో రోజో మనిషికి సీరియస్ అయిన సమయంలో చేయాల్సిన పనిని దీక్ష ప్రారంభించిన మూడు గంటల్లో చేయడం ఏంటని ప్రశ్నించారు. తనను మాత్రం గౌరవంగానే తీసుకు వెళ్లారని, తన భార్యను దారుణాతి దారుణమైన తిట్లు తిట్టారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News