: ఇస్రో సైంటిస్టులకు ప్రశంసల వెల్లువ!... శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
సింగిల్ షాట్ లో 20 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-34 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక విజయంగా పరిగణిస్తున్న ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన శాస్త్రవేత్తలకు... ప్రయోగం ముగిసిన వెంటనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందిస్తూ సందేశాలు పంపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం కొద్దిసేపటి క్రితం వేర్వేరు ప్రకటనలను విడుదల చేశాయి.