: మావోల కంచుకోటలో ఐటీడీఏ పీవో హరినారాయణన్ సాహసం!


పాడేరు సమీపంలోని కొయ్యూరు... మావోయిస్టులకు కంచుకోట. ఈ ప్రాంతంలోకి చిన్న చిన్న అధికారుల నుంచి పోలీసుల వరకూ రావాలంటే జంకాల్సిన పరిస్థితి. అటువంటిది పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఎం హరినారాయణన్, ఏకంగా మూడుసార్లు సందర్శించారు. ఈ దఫా మరోసారి వచ్చి, పూర్తి మావోయిస్టు ప్రాంతమైన దారకొండ నుంచి గుమ్మిరేవుల మీదుగా పోతవరం వెళ్లి పెను సాహసమే చేశారు. ఇది ప్రధాన రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఉన్న అడ్డదారి. గతంలో ఎన్ కౌంటర్లూ జరిగాయి. ఈ దారిలో వెళ్లిన తొలి పీఓ హరినారాయణనే కావడం గమనార్హం. అత్యంత మారుమూల ప్రాంతమైన ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన, రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉండటాన్ని చూసి, కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే మానేసిన వారందరినీ తిరిగి తీసుకురావాలని హెచ్ఎంను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

  • Loading...

More Telugu News