: బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం ఆపండి: 'సామ్నా'ను ఆదేశించిన హైకోర్టు


ముంబై ఎంపీ కిరిట్ సోమయకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం ఆపాలని శివసేన మౌత్ పీస్ సామ్నాను బాంబే హైకోర్టు ఆదేశించింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వార్తలు ప్రచురిస్తున్న సామ్నా పత్రికపై ఎంపీ కోటి రూపాయలకు పరువునష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు జస్టిస్ ఎస్ జే కథవాలా.. కిరిట్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఉండే వార్తలు ప్రచురించడాన్ని ఆపాలని ఆదేశించారు. అలాగే ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ నేతకు భంగం కలిగించే పనులు చేయవద్దని ప్రతివాది కల్పనా ఇనాందార్ కు సూచించారు. ఇనాందార్ పై కిరిట్ చేసిన ఫిర్యాదుల కేసుల ఫైళ్లను తమకు అప్పగించాలని పోలీసులను ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ సామ్నా పేపర్, దాని ఎడిటర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రావుత్, ప్రింటర్, పబ్లిషర్ రాజేంద్ర భగవత్, కల్పనా ఇనాందార్ లపై రాజ్యసభ సభ్యుడు కిరిట్ పరువునష్టం దావా వేశారు. ఓ ప్రెస్ మీట్ లో ఇనాందార్ మాట్లాడుతూ కిరిట్ తోపాటు శివసేన-బీజేపీ బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని సామ్నా పత్రిక ప్రచురించడంతో తన పరువుకు భంగం వాటిల్లిందంటూ కిరిట్ హైకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News