: రోహిత్ వేముల కులంపై తొలగని అస్పష్టత!... తాజా దర్యాప్తునకు గుంటూరు కలెక్టర్ ఆదేశాలు!


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నెలల తరబడి హైటెన్షన్ వాతావరణానికి కారణమైన రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల కులానికి సంబంధించి దర్యాప్తు ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. రోహిత్ వేముల దళితుడని అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు వాదిస్తుండగా... అతడు దళితుడు కాదని, బీసీ కేటగిరీకి చెందిన వడ్డెర కులానికి చెందిన వాడని మరో వాదన వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన గుంటూరు రెవెన్యూ యంత్రాంగం... రోహిత్ వేముల దళితుడేనని తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సిద్ధమయ్యారు. అయితే ఈలోగానే ఏమైందో తెలియదు కాని, రోహిత్ వేముల కులంపై అస్పష్టత నెలకొందని నిన్న దండే సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అతని అసలు కులం ఏదనే విషయాన్ని తేల్చేందుకు మరోమారు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News