: టెస్ట్ డ్రైవ్ పేరుతో 40 లక్షల కారును ఎత్తుకెళ్లిన తండ్రీకొడుకుల అరెస్ట్


మెర్సిడెజ్ బెంజ్ కారును కొనేందుకు వచ్చిన తండ్రీకొడుకులు టెస్ట్ డ్రైవ్ పేరుతో దానిని ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనిల్ ఆనంద్(54), ఆయన కుమారుడు సాహిల్ ఆనంద్(23), మరో వ్యక్తి కలిసి మే 6న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ లో ఉన్న టీ అండ్ టీ మోటార్స్ లిమిటెడ్ కు వచ్చారు. తమకో మెర్సిడెజ్ బెంజ్ కావాలంటూ సేల్స్ మేనేజర్ దీపక్ కుమార్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టెస్ట్ డ్రైవ్ కోసం అతడి నుంచి కారు తాళాలు తీసుకున్నారు. టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్లిన వారు గంటలు గడుస్తున్నా రాకపోయేసరికి అనుమానం వచ్చిన కుమార్ వెంటనే వారికోసం మరికొందరిని పంపించారు. అయితే వారు ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన కారు విలువ రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సోమవారం అదే కారులో గుర్ గావ్ నుంచి వెళ్లినట్టు సమాచారం అందుకున్న పోలీసులు దారికాచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News