: కొలిక్కిరాని నీటి కేటాయింపుల నిర్వహణ అంశం
ఈరోజు ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ యేడు నీటి కేటాయింపులు ఏ విధంగా చేసుకోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు మాట్లాడుతూ, నీటి కేటాయింపుల నిర్వహణ అంశం ఒక కొలిక్కి రాలేదన్నారు. ట్రైబ్యునల్ నుంచి తుది నిర్ణయం రానందున, నీటి కేటాయింపు గత ఏడాదిలోలాగానే కొనసాగించాలన్నారు. రేపు కూడా ఈ సమావేశం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.