: సీఎం చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టులో ఊరట లభించింది. 2008లో ఉప ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి వేళ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారని, ఇంకా పలు అభియోగాలతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పలుమార్లు విచారించిన హైకోర్టు ఈరోజు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.