: హెల్మెట్ ధరించి బైక్ నడిపిన మంత్రి గంటా
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. విశాఖపట్టణంలోని వైజ్ బాయ్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని అశీల్ మెట్ట ఫ్లై ఓవర్ పై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవగాహన లేకపోవడంతో యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించే దిశగా ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు చేపడుతోందన్నారు.