: తుని ఘటన కేసులో మరో ముగ్గురు విడుదల
తూర్పుగోదావరి జిల్లా తుని రైలు ఘటన కేసులో మరో ముగ్గురు కాపు సంఘాల జేఏసీ నాయకులు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రామకృష్ణ, ఏసుదాసు, విష్ణులను అధికారులు విడుదల చేశారు. కాగా, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరికొద్దిసేపట్లో తాను చేపట్టిన దీక్షను విరమించనున్నారు. విరమణ అనంతరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వారితో కలిసి ఆయన కిర్లంపూడి వెళ్లనున్నట్లు సమాచారం.