: ఇప్పటికిప్పుడు పిల్లల్ని తీసుకువెళ్లలేం... నీలోఫర్ అధికారులకు వీణా-వాణీల తండ్రి లేఖ
అవిభక్త కవలలు వీణా-వాణీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి అధికారులకు వీణా-వాణీల తండ్రి మురళి ఒక లేఖ రాశారు. తన ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా వీణా-వాణీలను ఇప్పటికిప్పుడు తీసుకువెళ్లలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే, ఆ లేఖలో వీణా-వాణీల తల్లి సంతకం లేకపోవడంపై ఆసుపత్రి అధికారులు దానిని తిరస్కరించారు. తన భార్యతో సంతకం చేయించుకుని మళ్లీ వస్తానని చెప్పి మురళి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా, అవిభక్త కవలలు వీణా-వాణీలకు శస్త్రచికిత్స నిర్వహించి వారిని వేరు చేయడం సాధ్యం కాదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇటీవల తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.