: భయపడేందుకు నేనేమైనా రాహుల్ గాంధీలా కనిపిస్తున్నానా?: మోదీపై కేజ్రీవాల్ నిప్పులు


కేంద్రం కేసులు పెడితే, భయపడేందుకు తానేమీ రాహుల్ గాంధీనో, రాబర్ట్ వాద్రానో కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేసులకు తాను భయపడబోనని అన్నారు. వాటర్ ట్యాంకర్ స్కాములో భాగంగా పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా తన పేరు పెట్టడంపై కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. మోదీ తానంటే భయపడుతున్నాడని, అందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించిన కేజ్రీవాల్, ఈ చర్యతో మోదీ పోరు తనతోనే అని చెప్పకనే చెప్పారని అన్నారు. నిజాలేంటో విచారణలో తేలుతాయని అన్నారు. కాగా, 2012లో ఢిల్లీ వాసులకు నీళ్లను సరఫరా చేసేందుకు 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోగా, ఈ వ్యవహారంలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతూ, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ వేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు షీలా దీక్షిత్ తో పాటు కేజ్రీవాల్ నూ ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News