: జోరుగా.. హుషారుగా..
'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ముగింపు సందర్బంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జనం నీరాజనాలు పలికారు. పాదయాత్ర విజయస్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం బాబు అగనంపూడి నుంచి ఆంధ్రా యూనివర్శిటీ మైదానానికి భారీ ఊరేగింపుగా బయల్దేరారు. నగరంలోని వీధుల్లోనుంచి బాబు యాత్ర సాగుతున్న సమయంలో ఆయనపై నగరవాసులు పూల వర్షం కురిపించారు. ఆ సమయంలో బాబు వెంట బాలకృష్ణ కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో టీడీపీ శ్రేణులు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నాయి.