: కేంద్రంతో గొడవలు కోరుకోవడం లేదు...ద‌త్తాత్రేయను విమ‌ర్శించే స్థాయి కాదు నాది!: కేటీఆర్


కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌లు కోరుకోవ‌డం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్డీఏ స‌ర్కారుతో స‌ఖ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని తెలిపారు. పార్టీ వేదికలపై విమర్శలు వేరు, ప్రభుత్వంతో సంబంధాలు వేరని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయను విమ‌ర్శించే స్థాయి త‌న‌ది కాద‌ని కేటీఆర్‌ అన్నారు. ఐటీఐఆర్‌పై కేంద్రానికి నివేదిక ఇచ్చామ‌ని, కొంద‌రు కేంద్ర‌మంత్రుల‌ను అధికారులు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ద‌త్తాత్రేయ దృష్టికి హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిధుల‌ను తీసుకెళ్లామ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News