: వేములవాడను తీర్చిదిద్దేలా బృహత్ ప్రణాళిక: ఇంద్రకరణ్ రెడ్డి
ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడను తీర్చిదిద్దేందుకు బృహత్ ప్రణాళిక వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఇంద్రకరణ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూనే పర్యాటక ప్రాంతంగా వేములవాడను అభివృద్ధి చెయ్యాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ తరహాలో సామాన్య భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా పలు నిర్మాణాలు జరపాలని చెప్పారు.