: బోర్డు తిప్పేసిన శ్రీమేధావి కాలేజీపై విద్యార్థుల దాడి...ఫర్నిచర్ ధ్వంసం


1,1,1,1, 2,2,2, 3,3, 4,4,4, ,6,6,6,6, 7,7,7,7,7... ఏంటి వరసగా నెంబర్లు వేస్తూ పోయారు అనుకుంటున్నారా? లేదు ఒక్కసారి గుర్తు చేసుకోండి... టీవీలో ర్యాంకులు సాధించాం, మా కాలేజీలోనే మీ పిల్లలని చేర్పించండి, సీఏ, సీపీటీలో ప్రపంచ పేరెన్నికగన్న కాలేజీ, మాకు బ్రాంచీలు లేవు...మా లోగోలో విక్టరీ సింబల్ ఉంటుంది అదే ఒరిజనల్' అంటూ హోరెత్తించిన శ్రీమేధావి సంస్థ గుర్తొచ్చిందా? ఈ సంస్ధ విశాఖలో బోర్డు తిప్పేసింది. విశాఖపట్టణంలోని ఎంవీపీ కాలనీలో శ్రీమేధావి విద్యాసంస్థ బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. తరగతులు నిర్వహిస్తామని చెప్పి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసింది. క్లాసులు ప్రారంభిస్తున్నామని చెప్పిన సంస్థ యాజమాన్యం రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. దీంతో విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News