: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ఉద్యోగులతో సమన్వయం చేసుకోవడం లేదని మండిపట్టారు. విజయవాడ నుంచి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, గుంటూరు నుంచి ప్రత్తిపాటి పాల్గొన్నారు. "విజయవాడ నుంచి గుంటూరు ఎంత దూరం? వచ్చి మాట్లాడేంత తీరిక నీకు లేదా? మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల మధ్య సమన్వయం లోపం ఎందుకు వస్తోంది. మనలో మనమే కౌన్సెలింగ్ చేసుకునే ఈ పరిస్థితి ఏంటి. ఇదేమీ మంచి పధ్ధతి కాదు" అని చంద్రబాబు అందరి ముందే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రత్తిపాటి చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది.