: ఆదాయపు పన్ను చెల్లించడం లేదా?... ఈ సౌకర్యాలన్నీ కట్!


ఆదాయపు పన్ను పరిధిలో ఉండి, పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారి ఆట కట్టించడం కోసం ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. వీరికి ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందే అన్ని సదుపాయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయాల ప్రకారం, పన్ను ఎగ్గొట్టే వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను నిలిపివేస్తారు. దీంతో వీరికి ఎక్కడా రుణాలు మంజూరు కావు. ఆపై వీరు అనుభవించే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యమూ రద్దవుతుంది. దీంతో పాటు పన్ను ఎగవేతదారులని తేలితే, వారి వంట గ్యాస్ సబ్సిడీని రద్దు చేయడం, వారి పేరిట ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిలుపుదల, కొత్త ఆస్తులను కొనుగోలు చేసినా వాటి రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని టాక్స్ ఆఫీసులకూ సమాచారం ఇచ్చింది. ఇదే సమయంలో సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్)లోని సమాచారాన్నంతా సమీకరించి, వాటి ఆధారంగా డిఫాల్టర్లను గుర్తించి వారి పేర్లను జాతీయ దినపత్రికల్లో ప్రచురించి పరువు తీయాలని, ఇదే సమాచారాన్ని 'నేమ్ అండ్ షేమ్' జాబితాలో ఉంచాలని కూడా నిర్ణయించింది. ఈ తరహా చర్యలతో వారందరినీ పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి చేర్చవచ్చన్నది ఐటీ విభాగం అధికారుల ఆలోచన. ఈ కొత్తగా తీసుకున్న సౌకర్యాల కత్తెరతో ఎంతమంది తమ బాధ్యతను నెరవేరుస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News