: యోగా చెయ్యిండి...విశ్వాసం పెంచుకోండి: బాలయ్య
హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేసిన బాలయ్య మాట్లాడుతూ, శ్వాసపై ధ్యాస ఉంచడం ద్వారా ఎన్నో రోగాలను నియంత్రించవచ్చని అన్నారు. రోజూ యోగా చేయడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఆరోగ్యం పొందుతారని, రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆయన తెలిపారు. యోగా ఆచరించండి, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండని ఆయన పిలుపునిచ్చారు.