: బంధువులను సామంతులను చేసుకోవడమే కేసీఆర్ తాజా వ్యూహం: కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తన బంధువులను అందరినీ, సామంతరాజులుగా మార్చుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని పన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఉదయం వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల విభజనలో ఎంతమాత్రమూ శాస్త్రీయతను పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. బంధువులకు, అస్మదీయులకు ఉద్యోగాలు, పదవులు కట్టబెట్టేందుకే అప్రజాస్వామికంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన పూనుకున్నారని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటును తమ పార్టీ అడ్డుకుంటుందని, కేసీఆర్ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.