: కాంట్రాక్టర్లకు లబ్ధి కూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదు: కోదండరాం
తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లోని టీజేఏసీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జేఏసీ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు లబ్ధి కూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదని ప్రభుత్వ పద్ధతులను విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి అందరికీ అందాలన్నదే జయశంకర్ ఆలోచన అని ఆయన అన్నారు. జయశంకర్ లేని లోటు సమాజంలో తీర్చలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలపై స్పష్టమైన నివేదికతో స్పందిస్తామని కోదండరాం తెలిపారు.