: అంబర్ పేటలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలుడు.. చిన్నారి మృతి
హైదరాబాద్ అంబర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి కుమ్మరివాడలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు పర్వేజ్ మృతి చెందాడు. తల్లి ముంతాజ్, మరో చిన్నారి అజీజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలయిన ఇద్దరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకి ఇల్లు ధ్వంసమైంది. గ్యాస్ సిలిండర్ లీకేజీతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దంతో స్థానికంగా అలజడి చెలరేగింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయాల పాలయిన ముంతాజ్, అజీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.