: ప్రయాణికుల నెత్తిన మరో బాంబ్.. ఏసీ క్లాస్ తత్కాల్ కోటా పెంచిన రైల్వే


ఏసీ తత్కాల్ కోటా పెంచి ఇండియన్ రైల్వే ప్రయాణికుల నెత్తిన మరో బాంబు వేసింది. సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ తత్కాల్ కోటాను ఒక్కసారిగా పెంచేసింది. తత్కాల్ లో థర్డ్ ఏసీ స్లీపర్ కోటాను 16 నుంచి 20 బెర్త్ లకు, సెకెండ్ ఏసీలో 10 నుంచి 17 బెర్త్ లకు పెంచేసింది. అలాగే ఏసీ చైర్ కార్ లోనూ తత్కాల్ కోటాను 16 నుంచి 22కు పెంచేసింది. ఈ పెంపుతో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. తద్వారా ప్రయాణికులపై విపరీతమైన ఆర్థిక భారం పడనుంది. రైల్వే నిర్ణయంతో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో 50 నుంచి 60 బెర్తులు తత్కాల్ కోటాలో లభించనున్నాయి. అయితే ఈ పెంపుతో ప్రయాణికులపై సెకెండ్ ఏసీలో రూ.400, థర్డ్ ఏసీలో అయితే రూ.350 అదనపు భారం పడనుంది. 500 కిలోమీటర్ల దూరం దాటితే మాత్రం 500 రూపాయల చేతి చమురు వదిలించుకోవాల్సిందే.

  • Loading...

More Telugu News