: ఆత్మహత్య చేసుకున్న అత్యాచార బాధితురాలు.. ఆగని వేధింపులే కారణం


స్నేహితుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ యువతి(22) ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. వ్యవహారాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకోవాలని నిందితుల కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు అదే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన స్నేహితుడు మరికొందరితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత నెలలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకుందామంటూ బాధిత యువతిని నిందితుల తల్లిదండ్రులు తరచూ వేధిస్తున్నారు. దీనికి తోడు తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేని బాధితురాలు ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం పొద్దెక్కినా యువతి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె గదిలో చూడగా ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News