: కాబూల్ మృతుల్లో భారతీయులు.. దాడి తమపనేనన్న ఐసిస్, తాలిబన్
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. కెనడా రాయబార కార్యాలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న గణేష్ థాపా, గోవింద్ సింగ్ ఈ దాడిలో మరణించినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. డెహ్రాడూన్ కు చెందిన వీరి కుటుంబాలకు సమాచారం అందించినట్టు తెలిపారు. కాగా కాబూల్ లో నిన్న మూడు చోట్ల ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం 24 మంది మరణించారు. మొదట ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా 14 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరో రెండు చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 10 మంది మృతి చెందారు. దాడులు తమపనేనని ఐసిస్, తాలిబన్ సంస్థలు ప్రకటించాయి.