: భార్యను వేధిస్తున్న వైసీపీ నేత... మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు


ఆయనో మాజీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. యువకుడిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేసిన సదరు నేత... ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి విపక్ష వైసీపీలో చేరారు. అంతేనా ఇటీవలే ఓ యువతిని పెళ్లి కూడా చేసుకున్నారు. తనను నమ్మి వచ్చిన ఆ యువతిని బాగా చూసుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఎన్నో ఆశలతో ఆ నేతాశ్రీ ఇంట కాలు మోపిన ఆ యువతి షాక్ తిన్నది. మాజీ ఎమ్మెల్యేగారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... ఇప్పటికే కాల్ మనీ కేసులో నిందితుడిగా బుక్కైన కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే కాల్ మనీ కేసు నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సతీమణి నిన్న రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మురళీకృష్ణపై వేధింపుల కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News