: సీఎం నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి అంబరీష్ రాజీనామా
మంత్రి వర్గం నుంచి తొలగించినందుకు నిరసనగా కన్నడ నటుడు అంబరీశ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు ఆయన అందజేశారు. అయితే ఆ లేఖ సరిగా లేదని పేర్కొంటూ డిప్యూటీ స్పీకర్ ఆయన రాజీనామాను తిరస్కరించారు. కేబినెట్ లో సంస్కరణలు చేపట్టిన సిద్ధరామయ్య, మంత్రివర్గంలో 14 మందిని తొలగించి, 13 మందికి స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవికి న్యాయం చేయలేకపోతున్నారంటూ అంబరీశ్ పై ఆరోపణలున్న నేపథ్యంలో సిద్ధరామయ్య అయనను తొలగించారు. కాగా, అంబరీశ్ రాజీనామాపై అభిమానులు భగ్గుమన్నారు. ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.